గీతంలో నేషనల్​ టెక్​ ఫెస్ట్​ ‘హవానా25’

గీతంలో నేషనల్​ టెక్​ ఫెస్ట్​ ‘హవానా25’

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్​ యూనివర్శిటీ స్కూల్​ ఆఫ్​ టెక్నాలజీలో నేషనల్​ టెక్ ఫెస్ట్​ 'హవానా 25' గురువారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ ఫెస్ట్​ ఈఈసీసీ విభాగానికి చెందిన జీ-ఎలక్ర్టా ఆధ్వర్యంలో కొనసాగనుంది.  ఇంజినీరింగ్ స్టాఫ్​ కాలేజ్​ ఆఫ్​ ఇండియా డైరెక్టర్ జి. రామేశ్వర్​ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

 విద్యార్థుల నైపుణ్యాలను పదును పెట్టడానికి హవానా లాంటి వేదికలు అవసరమని, పేపర్​ ప్రజెంటేషన్లు, వర్క్​షాప్​ల వల్ల తమలోని ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉంటుందని తెలిపారు. గీతం స్కూల్​ ఆఫ్​ టెక్నాలజీ డైరెక్టర్​ ప్రొఫెసర్ వీఆర్​ శాస్ర్తీ మాట్లాడుతూ హవానాలో భాగంగా డ్రోన్​ రేసింగ్, రోబో రేస్​, కోడెథాన్​, ప్రోటో ఎక్స్​ పో, గ్రిప్పర్​ బాట్ ఛాలెంజ్​, రోబో రెజ్లింగ్, హ్యాకథాన్, రోబో సాకర్​ లాంటి   ప్రజెంటేషన్​లతో పాటు ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు, నిపుణులతో టెక్నాలజీపై లోతైన అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

దేశ నలుమూలల నుంచి 40 కాలేజీలకు చెందిన 150 బృందాలు ఈ ఫెస్ట్​లో పాల్గొంటున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్​ జెబీ దఫేదార్​, జీ ఎలక్ర్టా ప్రెసిడెంట్ ఎం. సాయికృష్ణ, వైస్​ ప్రెసిడెంట్ ఎం. నరేశ్​, వివిధ పరిశ్రమల ప్రతినిథులు, టెక్​ ఎక్స్​పర్ట్​లు పాల్గొన్నారు.